District Collector Nishant Kumar said that there should be no problem of irrigation water resources
సాగునీటి వనరుల సమస్య ఉండరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జలవనరుల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మంగళ వారం సమీక్షించారు. తోటపల్లి భూసేకరణ పనులు వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అని వ్యవసాయం ప్రగతి పథంలో ఉండుటకు అవసరమైన నీటి వనరుల సరఫరాలో లోపం ఉండరాదని ఆయన అన్నారు. స్థిరీకరణ పనులతో పాటు, అదనపు ఆయకట్టుకు నీరు సరఫరా చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఆర్.అప్పారావు జిల్లాలో జలవనరుల వివరాలు తెలిపారు. ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టు చేర్చుటకు రూ.2 వందల కోట్లతో ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. చెక్ డాంల నిర్మాణానికి పునః ప్రతిపాదనలు తయారు చేసే సమర్పిస్తున్నామని ఆయన చెప్పారు. లష్కర్ లను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ అధికారులు జి. రామచంద్ర రావు, జగదీష్, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.