District Collector Nishant Kumar inspected the venue for World Adivasi Day at Sitampet.
*ఆదివాసీ దినోత్సవ వేదికకు స్థల పరిశీలన*
పార్వతీపురం (సీతంపేట), ఆగస్టు 1 : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సీతంపేటలో నిర్వహించుటకు వేదికను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, సబ్ డివిజనల్ పోలీసు అధికారి శ్రావణితో కలిసి సోమవారం వివిధ స్థలాలను పరిశీలించారు. రాష్ట్ర స్థాయి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లి గురుకులం, సీతంపేట ఐటిడిఎ, ఉన్నత పాఠశాల ప్రాంగణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న పెద్ద కార్యక్రమం అని విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సభా వేదికను చక్కగా తీర్చిదిద్దాలని, ఎక్కువ మంది ఆదివాసీలు హాజరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ కళా రూపాలు, ఆదివాసీ వంటకాలు, పంటలు, పరికరాలు, సామగ్రి తదితర అంశాలను ప్రదర్శించాలని ఆయన చెప్పారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, వర్షాకాలం దృష్ట్యా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు గుమ్మా నగేష్, కార్యనిర్వహక ఇంజినీర్ జి.మురళి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్, సబ్ ఇన్స్పక్టర్ బి.ప్రభావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.