Chief Commissioner of Land Administration and Special Chief Secretary G. Saiprasad ordered the Collectors to speed up the re-survey work undertaken across the state.
రీ సర్వే పనులు వేగవంతం కావాలి
పార్వతీపురం, జూలై 28 : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రీ సర్వే పనులు వేగవంతం కావాలని భూపరిపాలన చీఫ్ కమీషనర్ మరియు ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లోని భూముల రీసర్వే ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందున అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే ఎంతో ఉపయుక్తమన్నారు. వీటితో భూముల హద్దులు పక్కాగా నిర్ధారించవచ్చన్నారు. ఈ నేపధ్యంలో రీసర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రత్యేక ముఖ్యకార్యదర్శి తెలిపారు. లక్ష్యం మేరకు గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలో చేపట్టిన రీసర్వే వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేసారు. సర్వే చేయుటకు ముందుగానే మ్యుటేషన్లు, అడంగలు సవరణ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో వి.ఆర్.ఎ., వాలంటీరు సహకారంతో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని మండల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులందరికీ సర్వేకు ముందుగా 9(1)నోటీసులు అందజేయాలని, అభ్యంతరాలు ఉంటే 9(2) నోటీసు జారీచేయనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఒ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.