Special Chief Secretary for Land Administration A. Babu said the process of land mutation should be completed. He held a video conference on Thursday with collectors on land reserve, mutation, homesteads, homestead degree registration.
భూముల మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భూపరిపాలన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎ. బాబు అన్నారు. భూముల రీసర్వే, మ్యుటేషన్,ఇంటి స్థలాలు, ఇంటి స్థల పట్టా రిజిస్ట్రేషన్ పై కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే కార్యక్రమంలో మ్యుటేషన్ పూర్తి చేయాలని, మ్యుటేషన్ చేయునపుడు రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, పార్టషన్ లో వారసత్వ చట్టం ప్రకారం చేయాలన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే ఎంతో ఉపయుక్తమన్నారు. వీటితో భూముల హద్దులు పక్కాగా నిర్ధారించవచ్చని ఆయన పేర్కొన్నారు. రీసర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన తెలిపారు. భూముల సర్వే కోసం వచ్చిన అర్జీలను నిర్నీత సమయంలో పరిష్కరించాలని, గ్రామ సర్వేయర్లను అందుకు బాధ్యులను చేయాలని ఆయన అన్నారు. శాటిలైట్ ఆధారంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఇంటి స్థలం పట్టాలు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇంటి స్థల పట్టా రిజిస్ట్రేషన్ (ఒ టి ఎస్ ) పూర్తి చేయాలన్నారు. డాకుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఆటో జనరేషన్ లో డాకుమెంట్స్ వస్తాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొని జిల్లా వివరాలు తెలియజేశారు.