District Collector Nishant Kumar on Friday visited Jiyammavalasa Mandal and inspected several offices. Inspected Mandal Revenue Office, Village Secretariat, Farmer Assurance Center, Anganwadi School.
జియ్యమ్మవలస మండలంలో శుక్ర వారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యటించి పలు కార్యాలయంలను తనిఖీ చేశారు.
మండల రెవిన్యూ కార్యాలయాన్ని, గ్రామ సచివాలయంను, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ పాఠశాలను తనిఖీ చేశారు.
మండల రెవిన్యూ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సిబ్బంది హాజరు, యితర రికార్డు లను పరిశీలించారు. జగనన్న కాలనీలలో యిల్లు నిర్మాణం పురోగతిని సమీక్షించారు.మ్యుటేషన్లు త్వరితగతిన చేపట్టాలని ఆయన ఆదేశించారు. మ్యుటేషన్లకు దీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితి రాకుండా అన్ని చర్యలు చేపట్టి పరిష్కరించాలని సూచించారు. మండలం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిస్థితి, డాక్టర్స్, సిబ్బంది వివరాలు తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షా కాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, అతిసార వంటి వ్యాధులు ప్రబలుతాయని అటువంటి వ్యాధులకు అవకాశం లేకుండా గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో విధిగా వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం పాటించాలని ఆయన కోరారు
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాల పట్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ప్రశ్నించారు. అర్హుల జాబిత అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక తనిఖీ పక్కాగా జరగాలని ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ పథకాల సమాచారం ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చెత్త సంపద కేంద్రాలు సక్రమంగా,సమర్ధవంతం గా నిర్వహించాలని తెలిపారు.
సచివాలయం సందర్శించి సిబ్బంది హాజరు తనిఖీ చేశారు.
సచివాలయం సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని ఆయన అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన సూచించారు. అర్హులు, లబ్ధిదారులు జాబితాలు సచివాలయం లో ప్రదర్శించాలని అదేశించారు.
అంగన్వాడీ పాఠశాల తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ పరిశీలించారు. పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని, తక్కువ బరువు పిల్లలు, రక్తహీనత గల గర్భిణీ లను గుర్తించి వారికి మాత్రలు, పౌష్టికాహారం అందించి వారిపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.
శివరామరాజపురం గ్రామంలో జరుగుతున్న భూరక్ష పధకం పనులను పరిశీలించి మండలంలో రీసర్వే పనులు వేగవంతం కావాలని తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కారం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి సెంటు భూమి రీ సర్వే చేయాలని తప్పులు లేని భూరికార్డులు తయారు కావాలని ఆయన పేర్కొన్నారు.
బొమ్మిక రైతు భరోసా కేంద్రం పరిశీలించారు. వ్యవసాయ, పశు సంవర్ధక సహాయకులను గ్రామం లో రైతు లకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలో రైతు లకు విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలని అవసరమైన స్టాక్ నిల్వ చేసుకోవాలని మండల వ్యవసాయాదికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీరామమూర్తి, ఎం పి డి ఒ విజయలక్ష్మి, వ్యవసాయ,ఇతర అధికారులు తదితరుల పాల్గొన్నారు.