Close

District Collector Nishant Kumar on Thursday distributed computers to various departments in the district

Publish Date : 18/06/2022
District Collector Nishant Kumar on Thursday distributed computers to various departments in the district

*శాఖలకు కంప్యూటర్లు పంపిణీ*

పార్వతీపురం, జూన్ 16 : జిల్లాలో వివిధ శాఖలకు కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురు వారం పంపిణీ చేసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 23 శాఖల అధికారులకు 50 కంప్యూటర్లు 27 ప్రింటర్లు అందజేశారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ఒక్కొక్కటిగా మౌళిక సదుపాయాలు కల్పిస్తూ పాలన సమర్థవంతంగా సాగుటకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించుటకు అవకాశం కలుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం పూర్తి స్థాయిలో సిద్ధం కావడం, ఇతర శాఖల కార్యాలయాలు దాదాపుగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. పాలన సైతం వేగం పుంజుకొని ముందడుగులు పడుతున్నాయి. మౌళిక సదుపాయాలు కల్పించడం వలన కార్యాలయాలు మరింత బలోపేతం అవుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు. కార్యాలయాలు శత శాతం సామర్థ్యంతో పనిచేయాలని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఇడిఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు.