* Machine service scheme subsidy of `2.83 crore released to the district * Farmer Assurance Center o Palita Kalpavriksham
* జిల్లాకు 2.83 కోట్ల రూపాయల యంత్ర సేవా పథకం సబ్సిడీ విడుదల
* రైతు భరోసా కేంద్రo రైతుల పాలిట కల్పవృక్షం
పార్వతిపురం, జూన్ 07: జిల్లాకు 94 ట్రాక్టర్లు పరికరాలు వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా మంజూరైనట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం జిల్లాస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులకు, పేదలకు సాయం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. వ్యవసాయంలో వ్యయం తగ్గించి ఆదాయం పెంచుటకు, రైతులను ఆదుకునేందుకు యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా
కురుపాం నియోజకవర్గంలో రూ.79.28 లక్షల సబ్సిడితో 33 గ్రూపులకు, పార్వతీపురం నియోజకవర్గంలో రూ.58.53 లక్షల సబ్సిడితో 26 గ్రూపులకు, సాలూరు నియోజకవర్గంలో రూ.77.43 లక్షల సబ్సిడితో 25 గ్రూపులకు, పాలకొండ నియోజకవర్గంలో రూ.68.22 లక్షల సబ్సిడితో 27 గ్రూపులకు పంపిణి చేస్తున్నట్లు,
రైతులు 170 కంపెనీలకు చెందిన పది జిల్లాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కల్పించినట్లు తెలిపారు. తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు ఇచ్చుట వల్ల రైతుకు ఉపయోగంగా ఉంటుందని అదేవిధంగా సి హెచ్ సి సెంటర్లకు ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన
రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట కల్పవృక్షo వంటివని రైతులకు కావాల్సిన సమస్త సేవలుఅందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని అన్నారు. ఈ ప్రాంతం 90% వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, వెనుకబడిన ప్రాంతమని కావున వరి కోత యంత్రాల లో సబ్సిడీ ఎక్కువ ఇవ్వాలని, మరిన్ని ఎక్కువ యంత్రాలు సరఫరా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 306 రైతు భరోసా కేంద్రాల్లో 111 రైతు వినియోగ సేవా కేంద్రాలు (సి.హెచ్. సి.) ఏర్పాటు చేసి 94 ట్రాక్టర్లు, ఒక వరి కోత యంత్రం అందించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుటకు ఎంతో అవకాశం ఉందని, రైతులు సాంప్రదాయ విధానాలు వదలి, ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయం చేయాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అని, దానివల్ల రైతుకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. యంత్రాలు కొనుగోలులో రైతులకు నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. యంత్రాలు కొనుగోలులో రైతు వాటాగా 10శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణ సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. యంత్రాలను అద్దెకు ఇచ్చే టప్పుడు వివక్ష చూపించకూడదని, అవసరమైన రైతులందరికీ అద్దెకు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ లకు విడి భాగాలు, సర్వీసింగ్ సకాలంలో అందేలా ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న అనేక పథకాలలో యంత్ర సేవా పథకం ఒకటని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో తెలుసుకున్న రైతుల కష్టాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు చూసి వ్యవసాయానికి సహాయం చేయాలని, ప్రోత్సహించాలని అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పట్టణీకరణ కారణంగా గ్రామాలలో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడిందని, దాన్ని ఎదుర్కొనుటకు, రైతులను ప్రోత్సహించుటకు వైయస్సార్ యంత్ర సేవ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం వరి ఎక్కువ సాగు కాబట్టి ఎక్కువ యంత్రాలను జిల్లాకు కేటాయించాలని కోరారు.
శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ వ్యవసాయం యాంత్రీకరణ చేయాలని ఈ పద్ధతి ఉద్దేశమని, దీనివల్ల రైతులకు సాగుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు విత్తనాలు నుండి పంట కొనుగోలు వరకు సేవలు అందించుటకు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ చేయడం జరిగిందని, జిల్లా యంత్రాంగం రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేయాలని కోరారు. గత సంవత్సరం తుఫాన్ల కారణంగా ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొంటూ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఎకరా ఈ-క్రాప్ మోదు చేయాలని, నవంబర్ నెల మొదటి వారానికల్లా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పాలకొండ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డ ఈ ప్రాంతానికి ఈ పథకం చాలా ఉపయోగకరమని తెలిపారు. రైతుల కొరకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, చెరువులు, యంత్ర పరికరాలు అందిస్తుందని, వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సిబిల్ స్కోర్ తక్కువ గల సంఘాలకు రుణ సదుపాయం అవకాశం ఉండటం లేదని వారికి కూడా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కేవైసీ, ఈ -క్రాప్ నూరు శాతం నమోదు చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగం అని తెలిపారు.
జిల్లా సలహామండలి బోర్డు చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు కొరత గల ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయం చెయ్యడం కష్టమని, ఈ సమస్యను ఎదుర్కొనుటకు యాంత్రీకరణ తప్పనిసరి అని తెలిపారు. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. రైతులకు యంత్ర పరికరాలు వ్యక్తిగతంగా కూడా అందించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.
కరుణామయి రైతు మిత్ర సంఘానికి చెందిన గండేపల్లి రాము తమ గ్రూపుకు ఏడు లక్షల 32 వేలు రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ మంజూరైందని సంఘం వాటా 10 శాతం 73,797 రూపాయలు కట్టగా, 40 శాతం సబ్సిడీ 2,95,188 రూపాయలు మంజూరు అయిందని, మిగిలిన 50 శాతం 3,68,986 రూపాయలకు బ్యాంకు రుణం మంజూరు అయిందని తెలిపారు. ఈ సంఘం ద్వారా రైతు సలహా సంఘం నిర్ణయించిన ధరలకు రైతులకు అద్దెకు ఇచ్చి, రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనులు చేసి, కస్టమ్ హైరింగ్ సెంటర్ కు కూడా ఆదాయం వచ్చేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గంలో సాలూరు మండలానికి 9 ట్రాక్టర్లు, పాచిపెంట మండలానికి 5 ట్రాక్టర్లు, మక్కువ మండలానికి 7 ట్రాక్టర్లు వెరసి 21 ట్రాక్టర్లను రూ.53.34 లక్షల సబ్సిడీ, కురుపాం నియోజకవర్గంలో జి ఎల్ పురం మండలానికి 3 ట్రాక్టర్లు, కొమరాడ మండలం 5 ట్రాక్టర్లు, కురుపాం మండలానికి 3 ట్రాక్టర్లు, గరుగుబిల్లి మండలానికి 5 ట్రాక్టర్లు, జియ్యమ్మ వలస మండలానికి 8 ట్రాక్టర్లు వెరసి 24 ట్రాక్టర్లను రూ.59.85 లక్షల సబ్సిడీ, పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో 7 ట్రాక్టర్లు, సీతానగరం మండలానికి 13 ట్రాక్టర్లు, బలిజిపేట మండలానికి 4 ట్రాక్టర్లు వెరసి 24 ట్రాక్టర్లను రూ.50.85 లక్షల సబ్సిడీ, పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మండలానికి 5 ట్రాక్టర్లు, భామిని మండలానికి 8 ట్రాక్టర్లు, సీతంపేట మండలానికి 5 ట్రాక్టర్లు, వీరఘట్టం మండలానికి 7 ట్రాక్టర్లు వెరసి 25 ట్రాక్టర్లను రూ.58.47 లక్షల సబ్సిడీతో జిల్లాలో మొత్తం 94 ట్రాక్టర్లను రూ.2.22 కోట్ల సబ్సిడీ, ఇతర పరికరాలను రూ.60.86 లక్షల సబ్సిడీతోను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాధ్, వైస్ చైర్మన్ బాపూజీ, సింహాచలం, ఏఎంసీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్ పర్సన్ గౌరీ శ్వరి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఇతర అధికారులు, రైతులు హాజరయ్యారు.