State Governor Bishwabhushan Harichandan will visit Parvathipuram on the 10th of this month, District Collector Nishant Kumar said.
*10న రాష్ట్ర గవర్నర్ పర్యటన*
పార్వతీపురం, జూన్ 6 : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ నెల 10వ తేదీన పార్వతీపురం పర్యటనకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో హెలిపాడ్ స్థలాన్ని, లబ్దిదారులతో ముఖా ముఖి కార్యక్రమం వేదిక ఏర్పాటు స్థలాన్ని పోలీసు సూపరింటెండెంట్ వి.విద్యా సాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి సోమ వారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెలిపాడ్ ఏర్పాటు, పారిశుధ్యం, సభా స్థలి ఏర్పాటు, లబ్దిదారులు రాక తదితర అంశాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 గ్రామాలను, బయో గ్రామాలుగా ప్రకటిస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 గ్రామాల రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లాకు మొట్ట మొదటి సారిగా వి.వి.ఐ.పి రావడం జరుగుతుందని ఏర్పాట్లు పక్కాగా చేయుటకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, ఏఎస్పీ ఏ.సుభాష్, మునిసిపల్ కమీషనర్ సింహాచలం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి. వాగ్దేవి, జిల్లా అగ్ని మాపక అధికారి శ్రీను బాబు, గిరిజన సంక్షేమ అధికారి కిరణ్ కుమార్, డి.ఇ.ఓ పి.బ్రహ్మాజీ రావు,డి.ఆర్.డి.ఏ పిడి వై. సత్యం నాయుడు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి. సత్యనారాయణ రెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకర రావు, సర్వే అధికారి కె.రాజ్ కుమార్, ఆర్ అండ్ బి తదితరులు పాల్గొన్నారు.