Close

District Collector Nishant Kumar on Tuesday inspected the layout of Kottavalasa Jagannanna Colony under the municipality.

Publish Date : 06/06/2022
District Collector Nishant Kumar on Tuesday inspected the layout of Kottavalasa Jagannanna Colony under the municipality.

*నిర్మాణ సామగ్రి అందించడంలో పారదర్శకత ఉండాలి*

పార్వతీపురం, మే 31 : మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవలస జగనన్న కాలనీ లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం పరిశీలించారు. కాలనీ లేఅవుట్ లో ఎన్ని ఇళ్ళు మంజూరైనవి, ఇంకా నిర్మాణాలు ప్రారంభం కానివి ఎన్ని ఉన్నాయన్న విషయాలను గృహ నిర్మాణ శాఖ ఏఈ అర్. అనంత రావు ని ప్రశ్నించగా 248 ఇల్లు మంజూరు కాగా 53 ఇల్లు మ్యాపింగ్ పూర్తి చేసుకొని జియోట్యాగింగ్ చేసి ప్రారంభించనున్నామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇంటి యజమాని పెదగాడి గౌరమ్మ ను సిమెంట్ ఎన్ని బస్తాలు అధికారులు ఇచ్చారు, గృహ నిర్మాణ బిల్లు మంజూరైనదా, లేదా అనే విషయాలను కలెక్టర్ ఆరా తీయగా 20 బస్తాల సిమెంట్ అందించారని, పునాది నిర్మాణానికి 70వేల బిల్లు మంజూరైందని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభించని ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన మొదలు పెట్టాలని సూచించారు. ఇంటి నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు పారదర్శకంగా అందించాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, మున్సిపల్ కమిషనర్ పొందూరు సింహాచలం, ఇంచార్జి తసీల్దార్ షేక్ ఇబ్రహిం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వై.వాసు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.