92 applications were received in Spandana program held on Monday at the District Collector’s office.
*స్పందనకు 92 అర్జీలు*
పార్వతీపురం, మే 30 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 92 ఆర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
* సర్వే నెంబరు 43-1 లోని ఎ.5-74 సెంట్ల గ్రామ కంఠం భూమిని పేదల ఇళ్ల నిర్మాణాలకు, సంక్షేమ భవనం నిర్మాణానికి కేటాయించాలని సీతంపేట గ్రామ సర్పంచి ఆరిక కళావతి వినతి పత్రం అందజేశారు.
*వెంగళ రాయ సాగర్ కుడి కాలువ నుండి పిల్ల కాలువ వరకు కాలువ లైనింగ్ కాంక్రీట్ జరుగుతున్నందున సాగునీరు అందే విధంగా తూము ను ఏర్పాటు చేయాలని మక్కువ మండలం పేద బంటు మక్కువ చెందిన కర్రా సత్యనారాయణ తోపాటు పలువురు రైతులు కోరారు.
*అగ్రి గోల్డ్ స్కీం లో కట్టిన నగదు మొత్తాన్ని ఇప్పించాలని మండలం లోని బెలగాం గ్రామానికి టి.సంతోషమ్మ వినతి పత్రాన్ని అందజేశారు.
*కురుపాం మండలం నీల కంటా పురం పరిధిలోని కొండ ప్రాంతాలకు ప్రజల రాకపోకలు సాగించే విధంగా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ అడ్డాకుల మన్మధరావు అర్జీ ని అందజేశారు.
*జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు 50 మందికి మేట్ లుగా పనులు కల్పించాలని జియ్యామ్మ వలస మండలం చంద్ర శేఖర రాజపురం గ్రామానికి చెందిన పి.ఈశ్వర రావు, పలువురు కోరారు.
* కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై విధించిన సేస్ లు రద్దు చేయాలని, నిత్యావసరాల పై జిఎస్టి తగ్గించాలని, సిమెంటు, ఇసుక, ఐరన్ ధరలను చెబుతున్న అదుపులోకి తేవాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ లను తెలియజేస్తూ వామపక్ష పార్టీల కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు బి.నర్సింగరావు దరఖాస్తును అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు ప్రభాకర రావు, విజయ కుమార్, జె. శాంతీశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.