Selection is made for providing satisfactory services in all medical services in the hospital. District Collector Nishant Kumar honored the concerned medical officers with Lakshya and Kayakalpa awards
*లక్ష్య, కాయకల్ప అవార్డుల ప్రధానం*
పార్వతీపురం, మే 27 : జాతీయ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్స్ నిబంధనల మేరకు జిల్లా క్వాలిటీ ఎస్యురెన్స్ కమిటీ పరిశీలనలో 75 శాతంకు పైగా మార్కులు సాధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలలో సంతృప్తికర సేవలు అందించినందుకు ఎంపిక జరుగుతుంది. సంబంధిత వైద్య అధికారులను లక్ష్య, కాయకల్ప అవార్డులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సత్కరించారు. ఈ అవార్డును 10 పి.హెచ్.సిలు సాధించాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శుక్ర వారం నిర్వహించిన సమావేశంలో అవార్డులు అందించారు. నీలకంఠపురం, కొమరాడ, గరుగుబిల్లి, జి.ఎన్.పేట, దోడ్డికళ్ళు, బలిజిపేట, అరసాడ, భోగవలస, శంభర, మక్కువ పి.హెచ్.సిలు పొందాయి. పార్వతీపురం జిల్లాఆసుపత్రి సూపరింటెండెంట్ అవార్డు పొందారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, డెప్యూటీ డిఎంహెచ్ఓ అనిల్, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.