* Children’s health .. Community health .. * * Collector who inspected the Kurupam Anganwadi Center
*చిన్నారుల ఆరోగ్యమే .. సమాజ ఆరోగ్యం..*
*కురుపాం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
పార్వతీపురం, మే 27 : చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. భావిభారత పౌరులకు పౌష్ఠికాహారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కురుపాంలో శుక్రవారం పర్యటించిన జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రం, రైతు భారోసా కేంద్రాలను, గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. నాడు నేడు పనులు మంజూరు అయిన పాఠశాలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్ఠికాహారం, విద్యాపరమైన కార్యక్రమాలను పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తును స్వయంగా పరిశీలించారు. *చిన్నారి బరువు ఎంత అంటూ* పల్లా పవిత్ర అనే 16 నెలల చిన్నారి బరువును కలెక్టర్ నిశాంత్ పరిశీలించారు. 12.70 కిలోల బరువు, 95 సెంటీ మీటర్లు ఎత్తు ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారి పవిత్రకు వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం క్రింద పౌష్ఠికాహారాన్ని అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్నారు. జిల్లాలో చిన్నారుల్లో ఇంకా పౌష్ఠికాహార లోపం ఉందని రానున్న రెండు సంవత్సరాలలో సంపూర్ణ పోషణ క్రింద మంచి ఫలితాలు పొందుటకు కృషి చేస్తున్నామని తెలిపారు. పౌష్ఠికాహారం అందించుటకు ప్రభుత్వం ప్రాదాన్యత ఇస్తుందని అందులో భాగంగా గర్భవతులకు, బాలింతలకు పౌష్టికహారం అండించడం జరుగుతోందని ఆయన వివరించారు. సంపూర్ణ పోషణ ప్లస్ క్రింద గ్రుడ్డు, పాలు, భోజనం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాాహారం అందించుటలో అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. పౌష్టికాాహారానికి అంగన్వాడీ నిలయంగా ఉండాలని, మెనూ ప్రకారం ఆహారం అందాల్సిందేనని స్పష్టం చేశారు.
*విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నాం*
రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కేంద్రంలో ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తూ ఏర్పాటు చేసిందని అన్నారు. విత్తనం నుండి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరగాలని ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కియాస్కో ద్వారా రైతులకు అన్ని సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్, డిజిటల్ లైబ్రరీ, రైతు భరోసా ఛానల్ ను ఉపయోగించుకుంటున్న తీరును తనిఖీ చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ను ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నామన్నారు.
*అదనపు భవనానికి స్థలం మంజూరు*
నాడు నేడు కార్యక్రమంలో మంజూరైన పాఠశాల అదనపు భవనం నిర్మించుటకు స్థలాన్ని మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు.
*ప్రభుత్వ పథకాల సమాచారం అందాలి*
గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల సమాచారం అందాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఔట్ రీచ్ కార్యక్రమంలో ప్రజలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు పొందడంలో అర్హులైన లబ్ధిదారులు తప్పిపోరాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు శెట్టి పద్మావతి, సర్పంచ్ సుజాత, తహశీల్దార్ ఉమామహేశ్వర రావు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి విజయ గౌరి, మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.