Close

State Panchayati Raj Chief Secretary Gopalakrishna Dwivedi said that clean villages should be created.

Publish Date : 27/05/2022
State Panchayati Raj Chief Secretary Gopalakrishna Dwivedi said that clean villages should be created.

*పరిశుభ్రమైన గ్రామాలుగా అవతరించాలి*

పార్వతీపురం, మే 26 : పరిశుభ్రమైన గ్రామాలు అవతరించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల‌కృష్ణ ద్వివేది అన్నారు. పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్య‌క్ర‌మాలపై ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్‌లు గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ‌సంక‌ల్పంలో భాగంగా గ్రామాల్లో ఇళ్ల మ‌ధ్య చెత్త‌ కుప్ప‌లు లేకుండా చూడాలని అన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. గ్రామాల‌న్నీ ప‌రిశుభ్రంగా రూపొందించ‌డ‌మే కార్య‌క్ర‌మం ల‌క్ష్య‌మ‌ని ఆయన పేర్కొన్నారు. మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో స‌గ‌టు వేత‌నం పెరిగేలా జిల్లా క‌లెక్ట‌ర్‌లు కృషిచేయాల‌ని ఆయన ఆదేశించారు. స‌గ‌టు వేత‌నం అధికంగా ఉండటం వలన మెటీరియ‌ల్ కాంపొనెంట్ నిధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. మెటీరియ‌ల్ కాంపొనెంట్ ప‌నుల కోసం బిల్లులు ఆన్‌లైన్ లో అప్ లోడ్ చేసే విష‌యంలో శ్ర‌ద్ధ చూపాల‌ని పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ నిశాంత్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, ఆర్. డబ్ల్యు.ఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభాకర రావు, విజయ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.