The district collector examined CRPF Barrack on Tuesday for a change of veterinary hospital.
*సిఅర్పిఎఫ్ బరాక్ లోకి వెటరినరీ ఆసుపత్రి*
పార్వతీపురం, మే 24 : చాకలి బెలగాం లోని సిఆర్పిఎఫ్ బరాక్ లో ఉన్న భవనంలోకి వెటరినరీ ఆసుపత్రి మార్చాలని జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వెటరినరీ ఆసుపత్రి మార్పు కోసం మంగళ వారం సిఆర్పిఎఫ్ బరాక్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భవనానికి అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సిద్ధం చేయాలని అన్నారు. ఒపి విభాగం, మందులు నిల్వ గదిని ప్రాథమికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దశల వారీగా పూర్తి స్థాయి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రికి అదనంగా భవనాలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచుటకు ప్రతి పాదనలు ఉన్న సంగతి తెలిసిందే. అదనపు భవనాలను అదే ప్రాంగణంలో నిర్మించుటకు అనువుగా అచ్చట ఉన్న వెటరినరీ ఆసుపత్రిని మార్చుటకు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అర్.కూర్మనాథ్, నోడల్ అధికారి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.