Close

District Collector Nishant Kumar said that progress work in the district should be rushed. The district collector on Monday held a video conference with zonal officials on issues like housing, employment guarantee, today and so on.

Publish Date : 24/05/2022
District Collector Nishant Kumar said that progress work in the district should be rushed. The district collector on Monday held a video conference with zonal officials on issues like housing, employment guarantee, today and so on.

*ప్రగతి పనులు పరుగెత్తాలి*

పార్వతీపురం, మే 23 : జిల్లాలో జరుగుతున్న ప్రగతి పనులు పరుగెత్తాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ, నాడు నేడు తదితర అంశాలపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని ఆయన అన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరు మునిసిపాలిటి పరిధిలో ప్రారంభం కాకుండా ఉన్న 1169 తక్షణం ప్రారంభం కావాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనుల్లో వేతనదారులు ఎక్కువగా పాల్గొనాలని, గరిష్ఠ వేతనం వచ్చే విధానాన్ని వివరించాలని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ అకనాలెడ్జ్ మెంట్ లను తక్షణం పూర్తి చేయాలని ఆయన సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం క్రింద జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇ సేవలను తహశీల్డార్ లు త్వరితగతిన అందించాలని ఆయన ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే డేటాను వెంటనే అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.కూర్మి నాయుడు, ఇఇ శ్రీనివాస రావు, ఆర్.డబ్ల్యు.ఎస్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారులు ప్రభాకర రావు, విజయ కుమార్, జె. శాంతీశ్వర రావు, సర్వే అధికారి కె. రాజు కుమార్, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. సత్యం నాయుడు, ప్రజా ఆరోగ్య శాఖ డిఇ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.