Many demanded that the reconstruction work of the Thotapalli temple be undertaken. On Monday, a response program led by District Collector Nishant Kumar was held at the Collector’s office
*తోటపల్లి ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలి*
పార్వతీపురం, మే 23 : తోటపల్లి ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలని పలువురు కోరారు. సోమ వారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు విచ్చేసి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
* మక్కువ మండలం కాశీపట్నం గ్రామం అజ్జాడ రోడ్ నుండి శాంతేశ్వరం వరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రహదారి సౌకర్యం కల్పించాలని కాశీపట్నం గ్రామానికి చెందిన కె. శంకర్ నాయుడు వినతి పత్రం అందజేశారు.
* పట్టణ మెయిన్ రోడ్డుకు సమీపంలో వున్న నెల్లి చెరువు ఆక్రమణలకు గురి అవుతున్నందున ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చందక అనిల్ కుమార్ కోరారు.
*అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా స్పందన కార్యక్రమం లో అర్జీలు అందించేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆర్టిసి బస్సు సర్వీసులను నడపాలని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస రావు వినతి అందజేశారు.
* రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మీటర్ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోనేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి తరుపున బుడితి అప్పలనాయుడు, పలువురు కోరారు.
* పాచిపెంట మండలం గుంటూరు పంచాయతీ వేటగాని వలస వద్ద వంతెన నిర్మించి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే విధంగా సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ మాదల సింహాచలం వినతి పత్రాన్ని సమర్పించారు.
*గురుగుబిల్లి మండలం గిజబ గ్రామం వద్ద తోటపల్లి బ్యారేజీ ముంపునకు గురు అయినందున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ లో జరిగిన అవకతవకలను విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గిజబ గ్రామానికి చెందిన వెంకటరమణ బ్రహ్మ ఫిర్యాదును అందజేశారు.
* తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి, భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కురుపాం కు చెందిన పలువురు కోరారు.
* తనకు నిలిపివేసిన సికిల్ సెల్ ఏనీమియా పించన్ ను మంజూరు చేయాలని కొమరాడ మండలం అం కుమ్మరి గుంట పంచాయతీ కందివలస గ్రామానికి చెందిన కందిస తిలోత్తమ ఆర్జీ అందించారు.
స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు,ఆర్ అండ్ బి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్ ఇఇలు జేమ్స్, ప్రభాకర రావు, విజయ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మి నాయుడు, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి లావణ్య, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, తదితరులు పాల్గొన్నారు.