District Collector Nishant Kumar said that all steps have been taken to expedite the payment of arrears to NCS sugar farmers.
Publish Date : 23/05/2022
*ఎన్.సి.ఎస్ రైతుల బకాయిలు జమ*
పార్వతీపురం,మే 21 : ఎన్.సి.ఎస్ షుగర్ రైతులకు ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లింపుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. 50 వేల రూపాయలు లోపు బకాయిలు ఉన్న 1,514 మంది రైతులు ఉన్నారని వాళ్ళందరికీ శత శాతం చెల్లింపు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 50 వేల రూపాయలకు పైన బకాయిలు చెల్లింపు ఉన్న రైతులు 1,111 మంది ఉన్నారని వారికి 45 శాతం చొప్పున చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. ఈ మొత్తాలు సోమ, మంగళవారాల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని ఆయన పేర్కొన్నారు. వేలంలో దక్కించుకున్న యాజమాన్యం బకాయిలు చెల్లించిన వెంటనే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాలు జమ చేస్తామని ఆయన వివరించారు.