District Collector Nishant Kumar on Friday reviewed the construction of PMGSY and other roads in the forest area with the Panchayati Raj and Forest Department officials at the Collector’s office.
*అటవీ ప్రాంత రహదారులపై దృష్టి సారించాలి*
పార్వతీపురం, మే 13 : అటవీ ప్రాంత రహదారుల నిర్మాణంపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. అటవీ ప్రాంతంలో పి.ఎం.జి.ఎస్.వై తదితర రహదారుల నిర్మాణంపై పంచాయతి రాజ్, అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్ర వారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్షించారు. అనుమతుల కొరకు వివిధ స్థాయిలో ఉన్న వాటిపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అనుమతులు రావలసిన రహదారి పనులపై వెంటనే సంభందిత శాఖలకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి మాట్లాడుతూ జిల్లాలో 22 రహదారులకు అటవీ శాఖ అనుమతులు రావలసి ఉందన్నారు. ఈ రహదారులు సాలూరు మండలంలో 3, పాచిపెంట మండలంలో 8, కొమరాడ మండలంలో 1, కురుపాం మండలంలో 3, సీతంపేట మండలంలో 5, భామిని మండలంలో 2 రహదారులు ఉన్నాయని తెలిపారు. రూ.122 కోట్లతో నిర్మించే 162.47 కిలో మీటర్ల రహదారుల వలన 48 ఆవాసాలు ప్రయోజనం పొందుతాయని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో రహదారుల వలన 68.33 హెక్టార్ల భూమిని ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు అప్పగించాలని వివరించారు. 8 రహదారులకు మొదటి దశ అనుమతులను ప్రభుత్వం జారీ చేసిందని, మిగిలిన పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ సబ్ డి.ఎఫ్.ఓ రామారావు, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.