Close

District Collector Nishant Kumar said that street children should be identified and steps should be taken for their protection.

Publish Date : 10/05/2022
District Collector Nishant Kumar said that street children should be identified and steps should be taken for their protection.

వీధి బాలల రక్షణకు చర్యలు
పార్వతీపురం, మే 10 : వీధిబాలలను గుర్తించి వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీధిబాలలను గుర్తించుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో సమస్య తీవ్రత గల ప్రాంతాలను గుర్తించాలన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్స్, బ్రిడ్జిలు, మురికివాడ ప్రాంతాలు, నిర్మాణరంగ ప్రాంతాలు గల సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించాలన్నారు. వీటిని గుర్తించే బాధ్యత మహిళ పరిరక్షణ అసిస్టెంట్లకు కూడా అప్పగించాలి అన్నారు.
వీధిబాలల, బాల కార్మికుల సమస్య ఎక్కువగా గల ప్రాంతాలను గుర్తించి ఆ లిస్టు ను స్థానిక పోలీస్ స్టేషన్లకు అందజేయాలన్నారు.
నియోజకవర్గo, మండలాలు, గ్రామం, సచివాలయం వారీగా డేటా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా బాలల సంరక్షణ అధికారి కె వి రమణ మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది మంది వీధి బాలలను గుర్తించడం జరిగిందని, వారి వివరాలు బాల స్వరాజ్ వెబ్ పోర్టల్ నందు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. వీధిబాలల, బాల కార్మికులను గుర్తించి వారి పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ కమిటీ సమావేశంలో అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్. రమేష్, డిఎంఅండ్ హెచ్ఓ జగన్నాథరావు, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి వరహాలు, కార్మిక శాఖ అధికారి కే రామకృష్ణ రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఎస్. చిట్టి బాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.