75 petitions were received during the response program organized at the district collector’s office on Monday.
*స్పందనకు వినతుల వెల్లువ*
పార్వతీపురం, ఆగస్ట్ 1: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 75 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో అర్జీలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జెసి ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు స్వీకరించారు. జియ్యమ్మ వలస మండలం,రామినాయుడు వలస నుండి బద్దీ లక్ష్మి తనకు తాత్కాలిక సదరన్ మంజూరు చేశారని, దాని వల్ల తనకు ఎటువంటి ఉపయోగం లేదని అందువల్ల శాశ్వత సదరన్ సర్టిఫికెట్ ను మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామం నుండి రెడ్డి సుభద్ర సదరన్ లో తనకు ఎటువంటి పర్సెంటేజ్ రాలేదని సమస్యను పరిష్కరించాలని కోరారు. కొమరాడ నుండి కోళ్లు సాంబమూర్తి పార్వతీపురం నుండి కూనేరు వరకూ నైట్ హల్ట్ బస్ సౌకర్యం ను కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. పార్వతీపురం నుండి బూరాడ అమ్మడమ్మ తాను కూలీ అని 1.93 సెంట్ల భూమి ఉన్నదని రేషన్ కార్డు తీసేసారని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. సీతానగరం మండలం రంగంపేట గ్రామం రెవెన్యూ పరిదిలో 185/1 సర్వే నెంబర్ లో 7 ఎకరాల 68 సెంట్ల ఉమ్మడి భూమి ఉన్నదని దానిని సబ్ డివిజన్ చేసి రికార్డ్ లో నమోదు చేయాలని కోట.ప్రసాదరవు కోరారు. పార్వతీపురం 8 వ వార్డులో చెరువు ను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి, రోడ్డును కూడా వేస్తున్నారని వారిపై చర్యలు కె. అఖిల్ కోరారు. పార్వతీపురం మండలం అడ్డాపు శిల నుండి సూర్ల సూరయ్య పారిశుధ్య కార్మికులకు జీతాలు రావడం లేదని, డ్యూటీ అయిపోయిన తరువాత కూడా బియో మెట్రిక్ వేయించుకోవడం లేదని సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్వతీపురం మండలం బాల గుడబ నుండి బడి తాత బాబు భూమి ఎక్కువగా ఉన్నదని రేషన్ కార్డు ను రద్దు చేశారని ,పునఃరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్ ఇఇలు ఓ. ప్రభాకర రావు, ఎం.వి.జి. క్రిష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వాణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.