Deputy Chief Minister Pamula Pushpasrivani inaugurated the Parvathipurammanyam
కొత్త గా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సోమవారం ప్రారంభించారు.
పార్వతీపురం మన్యం మొదటి కలెక్టర్ గా నియామకమైన నిశాంత్ కుమార్,
జిల్లా ఎస్.పి విద్యాసాగర్ నాయుడు,
జె.సి ఓ.ఆనంద్ ఉప ముఖ్యమంత్రిని కలెక్టరేట్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్ లో నున్న వీడియో కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించారు. తదుపరి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, రఘురాజు, సభ్యులు రాజన్న దొర, శంబంగి చిన్న అప్పల నాయుడు, అలజంగి జోగా రావు, పాలకొండ ఎం.ఎల్.ఏ విశ్వసరాయ కళావతి, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరి శ్రీ ఐ.టి.డి.ఏ పి.ఓ ఆర్.కూర్మనాధ్, సబ్ కలెక్టర్ భావన, పాలకొండ ఐ.టి.డి.ఏ పి.ఓ నవ్య, ఆర్.డి.ఓ హేమలత, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకట రావు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గా పదవీ బాధ్యతను స్వీకరించిన అనంతరం డి.ఆర్.ఓ అధికారులతో పరిచయ కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించబడిన అధికారులంతా వెంటనే వారి వారి విధుల్లో చేరాలని, కార్యాలయ టేబుల్స్, కుర్చీలు, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ కనెక్షన్ తదితర అవసరాలన్నీటిని వెంటనే సమకూర్చుకోవా లన్నారు. ఎన్.ఐ.సి వారితో మాట్లాడుకుని శాఖాపరమైన లాగిన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో , ఆర్.సి.ఎం స్కూల్ లో ఏర్పాటుచేసిన పలు కార్యాలయాల విభాగాలను తనిఖీ చేశారు.
కొత్త జిల్లాగా వేగంగా అభివృద్ధి:: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి::: పరిపాలన వికేంద్రీకరణ తో మారు మూల ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని భావించి ముఖ్యమంత్రి జిల్లాల పెంపుదల చేసారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కలెక్టరేట్ ప్రారంభం అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో భాగంగా ఉన్నపుడు చివరన ఉన్నందున కొంత వెనుకబాటుకు గురయ్యాం అన్నారు. ఇక కొత్త జిల్లాలో అధికారులంతా జిల్లా కేంద్రంలో ప్రజలకు చేరువుగా ఉంటూ పాలన సాగిస్తారని, దానివలన ప్రజా సమస్యల కు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జిల్లా అభివృద్ధి వేగంగా జరుగు తుందని అన్నారు. తొలుత మన్యం జిల్లాగా నామకరణం చేసినప్పటికీ ప్రజల విజ్ఞాపణల మేరకు వారి మనో భావాల కనుగుణంగా పార్వతీపురం మన్యం గా పేరు మార్పు చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున
కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
సుస్థిర అభివృద్ది లక్ష్యం తో పనిచేస్తా: కలెక్టర్ నిశాంత్ కుమార్::
కొత్త జిల్లాకు తొలి కలెక్టర్ గా పనిచేయడం అదృష్టమని , ప్రభుత్వ ప్రధాన్యతల మేరకు సుస్థిర అభివృద్ధే లక్ష్యం గా పనిచేస్తానని కలెక్టర్ మీడియా తో తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం లో నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా పని చేస్తానన్నారు. పాలనా వికేంద్రీకరణ ఫలితాలను ప్రజలకు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
జిల్లా ఎస్.పి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను సమర్ధవంతంగా అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల సహకారం తీసుకుని సరిహద్దు గ్రామాల సమస్యల పరిష్కారం చేస్తామన్నారు.