Close

District Collector Nishant Kumar said parents’ committees should be involved in the work today. The district collector on Friday reviewed the work in the education department today at the collector’s office.

Publish Date : 13/05/2022
District Collector Nishant Kumar said parents' committees should be involved in the work today. The district collector on Friday reviewed the work in the education department today at the collector’s office.

*తల్లిదండ్రుల కమిటీలు భాగస్వామ్యం కావాలి*

పార్వతీపురం, మే 13 : నాడు నేడు పనుల్లో తల్లిదండ్రుల కమిటీలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. విద్యా శాఖలో నాడు నేడు పనులపై కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పనులు పకడ్బందీగా, వేగవంతంగా నాణ్యతతో జరగాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులతో కూడిన పాఠశాల యాజమాన్య కమిటీ పనులపై పూర్తి స్థాయిలో చర్చించాలని ఆయన ఆదేశించారు. సిమెంట్, ఇనుముకు వెంటనే ఇండెంట్ చేయాలని ఆయన సూచించారు. పనుల నిర్వహణకు ముందుగా సంబంధిత కమిటీలు రానున్న వారం రోజులలో వివరంగా చర్చించి అవగాహనతో పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పనులలో రాజీలేని విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో నాడు నేడు పనులు ఆదర్శవంతంగా జరగాలని, పాఠశాలలు ఆహ్లాదంగా మారాలని, పిల్లల నమోదు శాతం పెరగాలని ఆయన అన్నారు.

సమగ్ర శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డా.వి.స్వామి నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 192 పనులు మంజూరు అయ్యాయన్నారు. 37 పాఠశాలలు అప్ లోడ్ చేయాలని ఆయన తెలిపారు. పాఠశాలలు బ్యాంక్ ఖాతాలు తెరవవలసి ఉందని ఆయన అన్నారు.

ఈ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి జె.శాంతీశ్వర రావు, ఆర్. డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, మండల విద్యా శాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు.