Close

District Collector Nishant Kumar directed to complete the work Nadu-Nedu.

Publish Date : 18/06/2022
District Collector Nishant Kumar directed to complete the work Nadu-Nedu.

*నాడు నేడు పనులు పూర్తి చేయాలి*

పార్వతీపురం, జూన్ 15 : నాడు నేడు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. నాడు నేడు, సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవనాల పనులపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బుధ వారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 195 అదనపు భవనాల పనులను చేపట్టవలసి ఉందన్నారు. ఇసుకను ముందుగానే నిల్వలు పెట్టాలని తద్వారా రానున్న నెలల్లో పనులు చేయుటకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనుల రివాల్వింగ్ ఫండ్ తక్షణం అన్ని పనులకు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. భామిని మండలం సాంకేతిక సమస్య వెంటనే పరిష్కారం కావాలని ఆయన ఆదేశించారు. పాలకొండ మండల విద్యా శాఖ అధికారి నాడు నేడు పనులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంపై ఛార్జ్ మెమో జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డిఇఓను ఆదేశించారు. సిమెంటు, ఇసుక, ఇనుము కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టి సిద్ధంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

*భవన నిర్మాణంలో జాప్యం వద్దు*

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణ దశలో ఉంటే వాటిని నెల రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని నిర్మాణాలు తక్షణం ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. భవనాల నిర్మాణానికి స్థలాలు అవసరం అయిన చోట మండల తహశీల్డార్ వెంటనే స్థలాన్ని మంజూరు చేయాలని, అచ్చట నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, వివిధ శాఖల ఇంజినీర్లు ఓ. ప్రభాకర రావు, జి.మురళి, ఎస్ఎస్ఎ ఏపిసి నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు విజయ కుమార్, డా. క్రిష్ణాజి ఇతర ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.