Close

Chief Commissioner of Land Administration G. Saiprasad said that the process of land reserve should be expedited. He held a video conference with district collectors on Thursday on the land reserve

Publish Date : 18/06/2022
Chief Commissioner of Land Administration G. Saiprasad said that the process of land reserve should be expedited. He held a video conference with district collectors on Thursday on the land reserve

*రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి*

పార్వతీపురం, జూన్ 16 : భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి.సాయిప్రసాద్ అన్నారు. భూముల రీసర్వేపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే ఎంతో ఉపయుక్తమన్నారు. వీటితో భూముల హద్దులు పక్కాగా నిర్ధారించవచ్చని ఆయన పేర్కొన్నారు. రీసర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన తెలిపారు. భూముల సర్వే కోసం స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని, గ్రామ సర్వేయర్లను అందుకు బాధ్యులను చేయాలని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులను అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరుపై పర్యవేక్షణ ఉండాలని ఆయన చెప్పారు. శాటిలైట్ ఆధారంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సర్వే అధికారి కె. రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.